♫musicjinni

Nee Visvaasa Naavalo | Joy in jesus album Volume 1 Songs

video thumbnail
నీ విశ్వాస నావలో యేసు వున్నాడా అనే ఈ పల్లవి నరసాపురం లో జరిగిన ఒక మహా సభలకోసం అంశం గీతం గా ఒక సేవకులు దీనిని వ్రాసి, స్వరపరిచారు అని తెలిసింది. నా చిన్నతనంలో నేర్చుకున్న ఈ పాటపై ఉన్న మక్కువతో కేవలం 4 లైన్లు వుండే ఈ పల్లవిని ఒక పాట రూపంలో మల్చాలి అనే ఉద్దేశ్యంతో మరొక రెండు చారణాలు ఈ పాటకు నేను జోడించాను.
ఈ పాట ఇంతో గొప్పగా మల్చబడటానికి కారణం జోనా శామ్యూల్ గారి సంగీతం. నా ఆలోచనలు వారితో పంచుకొన్నాప్పుడు జోనాగారు పాటకు గొప్ప సంగీతాన్ని సమకూర్చారు. ఇక గాత్రం గురించి మాట్లాడుకోవాలి అంటే నరసాపురంలోని ప్రముఖ కీబోర్డ్ కళాకారులు డానియెల్ గారి కుమారుడు చరణ్ ఈ పాటను ఆలపించారు. లేత స్వరం మరియు చెప్పిన దానిని చెప్పినట్టుగా పాడి ఈ పాటకు వన్నె తెచ్చారు.
ఇక ఈ పాటకు వీడియో చెయ్యటానికి గొప్ప పోరాటమే చెయ్యవలసి వచ్చింది. నా స్నేహం పాటకొఱకు సమస్తం వెచ్చించవలసి వచ్చింది. దాని ప్రభావం ఈ పాటపై పడింది. ఈ పాటను గోదావరిలో పడవ మీద సుందరంగా తెరకెక్కించాలి అనే ఉద్దేశం కలిగి రెండు పడవల అద్దెకు తీసుకొని ఉమా గారి దగ్గర రెండు కెమెరాలు అద్దెకు తీసుకొని వాటి కెమెరా మెన్ లతో ఈ పాటను వేరు వేరు పడవల్లో షూట్ చేయడానికి సిద్ధపడ్డాము. అంతేకాకుండా పడవలో ప్రయాణికులు గా ఉండటం కొరకు కొంత మంది స్నేహితులను పోగు చేసి మాకు అవసరమైన భోజనాలు మొదలగునవి ఆ పడవలోనికి చేర్చుకున్నాం. నాటికి గోదావరి వరదలవల్ల నీటి ప్రవాహం ఎక్కువ ఉంది.
తీరా మేమందరం గోదావరిలోకి చేరేసరికి డాన్స్ వేయడానికి సిద్ధపడిన (పాట పాడిన) చరణ్ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగానూ డాన్సు కి అనుకూలంగా లేదు. చాలా ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేదు. చేసేదేమీ లేక చరణాల మధ్య మ్యూజిక్ కొరకు వీడియోలు అవసరం కాబట్టి కొన్ని వీడియోలు తీసుకొని ఆ రోజు షూటింగ్ ముగించవలసివచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే దీనికొఱకు ఖర్చుపెట్టినది అంతా గోదావరిలో కలిసిపోయినట్టు అయిపోయింది.
నాకు ఎవరి దగ్గర అప్పు చేయటం ఇష్టం లేక దేవుని మీదనే ఆధారపడి దేవుని అవకాశాలు ఇవ్వమని అడిగాను. మరికొద్ది రోజుల్లో చిన్న చిన్న కార్యక్రమాల్లో పాటలు పాడటం ద్వారా కొంత సొమ్మును సమకూర్చుకొని తిరిగి వీడియో చేయడానికి సిద్ధపడ్డాను. రాజమండ్రిలోని ఒక పాస్టర్ గారి కుమారుడు బాగా డాన్స్ చేస్తున్నాడు అని తెలిసి వారిని నర్సాపురం రప్పించాము. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత నాట్యం బాగా చేయటం చూసి మరలా గోదావరికి చేరుకొన్నాము. ఆ అబ్బాయి చిన్నవాడు కావటంతో పడవ నీటిలో కదులుతూ ఉండటాన్ని చూసి భయపడి తండ్రి ఒడిలో నుంచి అసలు బయటికి రాలేదు. ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం లేకపోయింది కనుక మరల రెండవసారి షూటింగ్ ముగించాల్సి వచ్చింది. ప్రయాస అంతా వృధా అయ్యింది.
తీవ్రమైన నిరాశతో ఇంటికి చేరిన తర్వాత ఈ పాట నేను ఇంకా పూర్తి చేయలేను అని కృంగిపోయాను. ఆర్థికంగా పూర్తిగా చితికిన స్థాయికి చేరిన తర్వాత ఈ పాటను ఇక వదిలేద్దాం అని అనుకున్నాను కానీ ఆ పాట మీద ఉన్న ఆసక్తి ఈ పాటను వదలడానికి మనసు ఏ మాత్రం అంగీకరించలేదు. కనుక మంగళగుంటపాలెం యూత్ దగ్గరికెళ్ళి దగ్గరకు వెళ్లి మీ ఊర్లో అత్యంత చురుకైన డాన్స్ చేయగల ఒక అబ్బాయిని నాకు చూపించండి అని అడిగి వారి సుండేస్కూల్లో యాక్టివ్ గా వుండే రవీందర్ అనే అబ్బాయిని ఎంపిక చేసుకొని వాడికి కఠినమైన తర్ఫీదు ఇచ్చి, అన్ని పరిస్థితులను తట్టుకునే విధంగా వాడిని సిద్ధపరచాము. అంతేకాక ఆర్థికంగా కెమెరాల కొరకు పడవల కొరకు పెట్టుబడి పెట్టే స్థితి లేక అన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. నాకు తెలిసిన ఒక కుటుంబం దగ్గర SONY HD MINI CAMCODER తీసుకొని దానితో నేనే స్వయంగా వీడియో చేయడానికి నిశ్చయించుకున్నాను.
మూడవ సారి ఈ పాట సూటింగ్ కొరకు రెండు పడవలు కాకుండా ఒకేఒక్క పడవను తీసుకున్నాను. దగ్గరలోని నా స్నేహితులందరినీ పిలిచి వారందరితో మూడవ సారి షూటింగ్ లో సిద్ధపడ్డము. ఆ రోజు విపరీతమైన ఉత్కంఠతతో షూటింగ్ మొదలు పెట్టినప్పటికీ రవీందర్ చాలా చక్కగా చేయడం మొదలుపెట్టాడు ఏ విధమైన భయం లేకుండా చాలా వేగంగా పాట నాట్యం చేయగలిగాడు. పాటయొక్క పల్లవి మొదటి చరణం చాలా ఉత్సాహంగా జరిగింది కానీ రెండవ చారణానికి వచ్చేసరికి రవీందర్ సహకరించడం మానేశాడు. పూర్తిగా నెమ్మదించిపోయాడు ఎంత ప్రయత్నించినా అతనిలో చురుకుదనం మాత్రం రాలేదు. మండుటెండలో అసహనం, నిరుత్సాహం బాగా పెరిగిపోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా వాడి బాధ అర్థం అయింది. రవీందర్! ఆకలేస్తుందా? అని అడిగితే... అవును! అని తల ఊపాడు. నా హృదయం, నా కళ్ళు, కన్నీటితో నిండిపోయాయి. అప్పటికి మధ్యాహ్నం రెండు కావస్తోంది వెంటనే పడవను దరికి పోనిఇవ్వమని చెప్పి మా దగ్గర భోజనానికి అవసరమైన డబ్బు లేకపోవడంతో కొన్ని చెగోడీలు జంతికలు కొని రవీంద్ర కి ఇచ్చిన తర్వాత మేమందరం కొద్ది కొద్దిగా తిని షూటింగ్ ప్రారంభించాము. గంట తర్వాత రవీందర్ కొంచెం ఓపిక తెచ్చుకుని డాన్స్ చేయడం ప్రారంభించాడు చివరకు సాయంత్రం నాలుగు గంటలకు షూటింగ్ పూర్తయింది. కానీ పాట వీడియో లో రెండవ చరణంలో రవీందర్ యొక్క ఆకలి, వేలాడిన చేతులు, నీరసించిన మొఖం మరియు పడవలో ఉన్న యవణస్థుల నీరసం ఇప్పటికీ స్పష్టంగా వీడియో లో ఉంటాయి. అయితే ఈ పాటను మరొకసారి చేయడానికి ఆ రోజు నాకు ఇంకొక అవకాశం లేదు. కాబట్టి పాట వీడియో విషయంలో క్వాలిటీ విషయంలో రాజీ పడాల్సి వచ్చింది అని చెప్పక తప్పటం లేదు. నాతో వచ్చిన యవనస్థులు వట్టి కడుపులతో పడవలో కూర్చుని నాతో సహకరించిన వారి గొప్ప మనసును నేను ఎప్పటికీ మర్చిపోలేను. మిగిలిన పాటలతో పోల్చుకుంటే ఈ పాట క్వాలిటీ కొంచెం తక్కువే అయినప్పటికీ ఎందరో ఈ పాటను ఆదరించారు, పాటనుబట్టి ప్రోత్సహించారు, కాన్సెప్ట్ ను మెచ్చుకొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు క్రైస్తవ పాటలు ఈ విధమైన క్రియేటివిటీ కనపరిచిన పాటల్లో ఇదే మొదటిది. నేటికీ ఈ పాట క్రిస్మస్ లో క్రైస్తవ సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ పాట తనదైన ముద్ర వేసింది అని చెప్పక తప్పదు.
ఈ పాట కొరకు ప్రయాసపడిన అందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
దేవునికే మహిమ కలుగును గాక!

Illu katta Nishayinche Viveki | Joy in jesus album Volume 2 Songs

Mana thandri Devudu | Joy in jesus album Volume 1 Songs

Chuk Chuk Bandi | Joy in jesus album Volume 2 Songs

Aakashamlo | Joy in jesus album Volume 1 Songs

Naa Sneham | Joy in jesus album Volume 1 Songs

Mana Yesu | Joy in jesus album Volume 2 Songs

Devuni Prema | Joy in jesus album Volume 2 Songs

Nee Visvaasa Naavalo | Joy in jesus album Volume 1 Songs

Unnatha Rajyam | Joy in jesus album Volume 1 Songs

Ding Ding Ding | Joy in jesus album Volume 1 Songs

Rarandi rakshakudesuni | Joy in jesus album Volume 2 Songs

Techno Mix | Joy in jesus album Volume 1 Songs

Nilabadi Paadedha | Joy in jesus album Volume 1 Songs

Andhamaina srushtini | Joy in jesus album Volume 2 Songs

Novahu Voda twaraga Cheyumu | Joy in jesus album Volume 1 Songs

Yesu Neke naa chinni hrudayam | Joy in jesus album Volume 2 Songs

I've got the Joy Joy Joy | Kids Songs | Hi Heaven

CORONA CORONA || Corona Song || Joy in Jesus Vol 3 || Pitta Naveen

Facebook YouTube edhaina Kaani |Jonah Samuel | Leslie Luther| Latest telugu christian song

VODAKATTENU BHALE | JOY IN JESUS | PITTA NAVEEN | SUNDAY SCHOOL ACTION SONGS | Volume 3

Summer Bible Songs Collection 2022 (Animated with Lyrics)

Joy in JESUS volume 3 Release Promo

Walking with Jesus | More Christian Songs for Kids | Kids Faith TV

Yona Yona | Jonah Jonah | Pitta Naveen | Joy in Jesus Vol 2 | Jeeva Pakerla | Jonah Samuel

New Telugu Christian Animation Song For Kids | చిన్ని గొఱ్ఱె పిల్లలా | Chinnai Gorre Pillala

నోవహు తాత ...| Telugu Christian Song for Kids | Rihana | Animation Song

WALKING WITH JESUS (23 sing-along songs for kids)

Telephone to Jesus || JJ tv || Sunday School Songs || Animated Christian Songs

Jesus Loves The Little Children | Children Songs For Kids

25 Most Popular Sunday School Songs

Disclaimer DMCA